లేటెస్ట్

అది కేకే స‌ర్వే కాద‌ట‌..ఈనాడు స‌ర్వే అట‌...!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చిన కేకే స‌ర్వే సృష్టించిన క‌ల‌క‌లం అంతా ఇంతా కాదు. టిడిపి కూట‌మికి 161 సీట్లు వ‌స్తాయ‌ని కేకే ప్ర‌క‌టించారు. ఆయ‌న స‌ర్వే రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం సృష్టించింది. అయితే ఈ స‌ర్వేను వైకాపా కొట్టిపారేయ‌గా, టిడిపి కూట‌మి అభిమానులు స్వాగ‌తించారు. దీనిపై రాజ‌కీయంగా వాదోప‌వాదాలు సాగాయి. అయితే ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత కేకే స‌ర్వేను మించి టిడిపి కూట‌మికి 164 స్థానాలు వ‌చ్చాయి. దీంతో ఒక్క‌సారిగా కేకే లోక‌ల్ నుంచి ఢిల్లీ వ‌ర‌కు హీరోగా మారారు. ఆయ‌న స‌ర్వేపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింది. అయితే ఇప్పుడు ఈ స‌ర్వే కేకేది కాద‌ని, ఆయ‌న‌కు స‌ర్వే చేసేంత ఆర్థిక ప‌రిస్థితులు లేవ‌ని, ఇది ఒక ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక చేయించిన స‌ర్వే అని, ఆ దిన‌ప‌త్రిక ఈనాడు అని టిడిపి ఎమ్మెల్యే కొలిక‌ల‌పూడి శ్రీ‌నివాస‌రావు ఒక టీవీ ఛానెల్ చ‌ర్చ‌లో చెప్పారు. ఆయ‌న నేరుగా ఈనాడు పేరును ప్ర‌స్తావించ‌కుండా, ఇంటింటా ఉండే దిన‌ప‌త్రిక‌, రాష్ట్రంలో అత్య‌ధిక స‌ర్య్కులేష‌న్‌, ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ ఉన్న ప‌త్రిక అంటూ ప‌రోక్షంగా ఈనాడును ఉంటంకించారు. ఆయ‌న చెప్పిన ప్ర‌కారం రాష్ట్రంలో ఏ స‌ర్వే సంస్థ‌కు స‌ర్వే చేసేంత ఆర్థిక వ‌న‌రులు లేవ‌ని 99శాతం స‌ర్వేల‌న్నీ బోగ‌స్ అని, కేకే స‌ర్వేను తాను త‌ప్పు ప‌ట్ట‌డం లేద‌ని, కానీ ఆ స‌ర్వే అత‌నిది కాదంటూ ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశారు. ఈనాడు సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్వే చేయించింద‌ని, ఆ స‌ర్వేలో టిడిపి కూట‌మికి 162 స్థానాలు వ‌స్తాయ‌ని తేలడంతో, వారు నేరుగా ఆ విష‌యం వారి ప‌త్రిక ద్వారా చెప్ప‌కుండా, ప‌రోక్షంగా ఇత‌ర వ్య‌క్తుల చేత చెప్పించార‌ని అన్నారు. ఈనాడు చేసిన స‌ర్వేను కెకె ద్వారా చెప్పించాల్సిన అవ‌స‌రం వారికి ఎందుకు ఉంటుంద‌నే ప్ర‌శ్నకు కొన్ని కార‌ణాల‌వ‌ల్ల వారు విడుద‌ల చేయ‌లేద‌ని ఆయ‌న అన్నారు. మొత్తం మీద వంద‌శాతం స‌ర్వే ఫ‌లితం రాబ‌ట్టాడ‌ని ఇన్నాళ్లూ కెకేను పొగుడుతున్న‌వారికి ఇప్పుడు విష‌యం అర్థ‌మై ! ఔరా కేకే..అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ