లేటెస్ట్

సిఎం చంద్ర‌బాబును క‌ల‌వ‌నున్న వై.ఎస్‌.సునీత‌...!?

రాష్ట్రంలో టిడిపి కూట‌మి అధికారంలోకి రావ‌డంతో కొంద‌రికి స్వేచ్ఛ‌వ‌చ్చింది. అలా స్వేచ్ఛ‌, స్వాతంత్య్రం వ‌చ్చిన వారు ఇప్పుడు త‌మ స‌మ‌స్య‌ల‌ను ముఖ్యమంత్రి చంద్ర‌బాబు దృష్టికి తీసుకురావ‌డాని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో బాధితులైన వారు త‌న‌ను క‌ల‌వ‌వ‌చ్చున‌ని, వారు వ‌చ్చి క‌లిస్తే వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని త‌మ ప్ర‌భుత్వం వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తుంద‌ని నూత‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇప్ప‌టికే చెప్పారు. ముఖ్య‌మంత్రి ప్ర‌క‌ట‌న త‌రువాత ప‌లువురు ఆయ‌న‌కు గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన అన్యాయాల‌ను ఏక‌రువుపెడుతున్నారు. దీనిపై ఆయ‌న సానుకూలంగా స్పందిస్తూ వారికి జ‌రిగిన అన్యాయాల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారు. కాగా..2014 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన వై.ఎస్‌.వివేకానంద‌రెడ్డి హ‌త్య విష‌యంలో గ‌త ఐదేళ్ల‌లో ఎటువంటి పురోగ‌తి క‌నిపించ‌లేదు. సాక్షాత్తూ త‌న బాబాయి హ‌త్య‌కు గుర‌యినా..ముఖ్య‌మంత్రిగా ఉన్న జ‌గ‌న్ ప‌ట్టించుకోలేద‌ని, వివేకా కుమార్తె సునీత గ‌త ఐదేళ్లుగా విమ‌ర్శిస్తూ వ‌స్తున్నారు. దీనిపై ఆమె న్యాయ‌పోరాటం చేస్తున్నారు. 

త‌న తండ్రిని క‌డ‌ప ఎంపి అవినాష్‌రెడ్డి హ‌త్య చేయించార‌ని, దీనికి అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కుటుంబ స‌భ్యుల ప్రోత్సాహం ఉంద‌ని ఆమె ఆరోపిస్తున్నారు. వివేకా హ‌త్య‌పై సీబీఐ విచార‌ణ చేసి, ఈ హ‌త్యలో క‌డ‌ప ఎంపి అవినాష్‌రెడ్డి పాత్ర ఉంద‌ని, ఆయ‌న‌ను అప్ప‌ట్లో అరెస్టు చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. అయితే..అప్పుడు ఆయ‌న‌ను అరెస్టు చేయ‌నీయ‌కుండా అప్ప‌టి సిఎం త‌న‌కు ఉన్న అధికారాన్ని ఉప‌యోగించారు. ఇంతలో ఎన్నిక‌లు రావ‌డం, త‌న తండ్రి హ‌త్య వెనుక జ‌గ‌న్‌, అవినాష్‌రెడ్డిలు ఉన్నార‌ని సునీత‌, రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిలలు ప్ర‌చారంలో ఆరోపించారు. వారు ఎంత ప్ర‌చారం చేసినా, ఎంత న్యాయ‌పోరాటం చేసినా..అధికారంలో ఉన్న జ‌గ‌న్‌ను ఏమీ చేయ‌లేక‌పోయారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓడిపోవ‌డంతో మ‌ళ్లీ వివేకా హ‌త్య కేసుపై విచార‌ణ జ‌రిపించాలని, ఇందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రించాల‌ని సునీత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును కోరబోతున్న‌ట్లు విశ్వ‌స‌నీయంగా తెలిసింది. ఆమె ముఖ్య‌మంత్రి అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నార‌ని, ఆయ‌న అపాయింట్‌మెంట్ ఇస్తే వివేకా హ‌త్య విచార‌ణ‌ను వేగ‌వంతం చేయాల‌ని కోరే అవ‌కాశం ఉంది. సీబీఐకు రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రించాల‌ని, అదే విధంగా సీబీఐపై రాష్ట్ర ప్ర‌భుత్వం పెట్టిన కేసుల‌ను ఎత్తివేయాల‌ని, త‌న‌పై ఉద్దేశ్వ‌పూర్వ‌కంగా పెట్టిన కేసుల‌ను తొల‌గించాల‌ని, సీబీఐ విచార‌ణ వేగ‌వంతం చేసి, నిందితుల‌కు శిక్ష ప‌డేవిధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రించాల‌ని ఆమె కోర‌బోతోంద‌ని తెలుస్తోంది.మొత్తం మీద వివేకా హ‌త్య కేసును సీబీఐ వేగంగా విచార‌ణ చేయ‌బోతోంద‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ