పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్‌తో వరదలపై విషప్రచారం...!
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే..చుట్టకాల్చుకోవడానికి నిప్పు అడిగాడట ఒకడు..అచ్చం అలానే ఉంది వైకాపా అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి వ్యవహారం. విజయవాడ వాసులంతా..వరదనీటితో మునిగి అల్లాడుతుంటే..తీరిగ్గా వచ్చిన జగన్..వారిని ఆదుకుంటున్న ప్రభుత్వంపై విష ప్రచారానికి దిగారు. 75ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన మంత్రులు, అధికారులు అహోరాత్రులు వరదబాధితులను ఆదుకోవడానికి కృషిచేస్తుంటే..వారిని ఎలా బదనాం చేద్దాం..ఎలా రాజకీయ ప్రయోజనాలు పొందుదామనే దుర్భుద్ధితో జగన్ విషప్రచారానికి శ్రీకారం చుట్టారు. కృష్ణాజిల్లా, విజయవాడ ప్రాంతాలకుచెందిన కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌కు సొమ్ములు వెదజల్లి వరదబాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని భారీగా ప్రచారాన్ని ప్రారంభించారు. స్వయంగా ముఖ్యమంత్రే వరదబాధితులకు సహాయం చేస్తుంటే..సహాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే ప్రచారాన్ని జగన్ పెయిడ్ ఛానెల్స్ విస్తృతంగా చేస్తున్నాయి. లక్షల మంది నిరాశ్రయులుగా మారడంతో...సహాయకార్యక్రమాలు అందరికీ ఒకేసారి అందించడం ఏ ప్రభుత్వానికైనా శక్తికి మించినపనే. అయినా చంద్రబాబు ప్రభుత్వం అవిశ్రాంతంగా పనిచేస్తూ వారిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తుంటే..వారిపై బురదజల్లడానికి పెయిడ్ యూట్యూబ్ ఛానెల్స్‌తో జగన్ వికృతానందం పొందుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొన్నిచోట్ల వరదబాధితుల దగ్గరకు వెళ్లి చంద్రబాబును, ఆయన బృందాన్ని ఈ ఛానెల్ ప్రబుద్ధులు బూతులు తిట్టిస్తున్నారు. ప్రభుత్వం చాలా వరకూ సహాయ కార్యక్రమాలు చేపట్టినా, సహాయబృందాలు వెళ్లలేనిచోట..వరదబాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది నిజమే...అందరికీ సహాయం అందలేదనేది కూడా నిజమే. అయితే..దీన్ని సాకుగా తీసుకుని పనిచేస్తున్నవారిపై విషప్రచారానికి దిగారంటే..వారి ఉద్దేశ్యాలను అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల కొంత మంది ప్రవేట్ ఆపరేటర్లు వరదబాధితులను ఆదుకోవడానికి సొమ్ములు వసూలు చేస్తున్నారనేది కూడా నిజమే. అయితే..ప్రభుత్వమే ఇలా చేయిస్తుందని సదరు ఛానెల్స్ ప్రచారం చేయడం నిజంగా హేయమైన చర్య. అదే విధంగా రాజధాని అమరావతి మునిగిపోయిందని, చంద్రబాబు ఇళ్లు మునిగిపోయిందని, విజయవాడ అంతా విలవిలలాడుతుందనే ఫేక్ ప్రచారాన్ని ఆయా పెయిడ్ ఛానెల్స్ హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల ముందు కూడా ఇలాంటి ఛానెల్స్ జగన్ సొమ్ములకు ఆశపడి ఆయనకు మద్దతుగా ప్రచారాన్ని హోరెత్తించారు. అయితే..ప్రజలు వారి ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టారు. ఇప్పుడూ అదే రకంగా ప్రయత్నిస్తున్నారు. అయితే..వారు ఏమి చెప్పినా..చంద్రబాబు, ఆయన బృందం పడుతున్న కష్టాన్ని, చేస్తున్న సహాయాన్ని పొందుతున్నవారు..ఈఫేక్ ప్రచారాన్ని నమ్మే పరిస్థితి ఎంత మాత్రం లేదు.