I&PR Director బదిలీ...!?
రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్ హిమాన్ష్ శుక్లా బదిలీ కానున్నారా..? అంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒక ప్రముఖ దినపత్రికలో ఆయన ఎన్టీఆర్ జిల్లాకు కలెక్టర్‌గా వెళ్లునున్నారనే కథనం వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఈనెల 16వ తేదీ లోపు తెలంగాణలో రిపోర్ట్ చేయాలని డీఓపీటీ (Department Of Personnel and Training)ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఆమె తెలంగాణకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆమె అక్కడకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. దీనిపై ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఇక్కడ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, కేంద్ర పెద్దలతో మాట్లాడాలని ఆమె ముఖ్యమంత్రిని కోరారు. దీనికి ముఖ్యమంత్రి ఆమోదించారని, ఆయన కనుక ఢిల్లీ పెద్దలతో మాట్లాడితే..వారు ఆయన కోర్కెను అంగీకరిస్తే..ఆమె ఇక్కడ ఉంటారు. ఒకవేళ అంగీకరించకపోతే..ఆమె తెలంగాణకు వెళ్లాల్సిందే. కాగా చంద్రబాబు వినతిని కేంద్రం అంగీకరించే పరిస్థితి లేదు. సృజనకు మినహాయింపు ఇస్తే..మిగతావాళ్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణలో ఉన్న అమ్రాపాలిని ఆంధ్రాకు పంపకుండా..ఆపాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్రానికి విజ్ఙప్తి చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరికి మినహాయింపు ఇస్తే..తాము ఇచ్చిన ఉత్తర్వులకు అర్థం ఏమి ఉంటుందని కేంద్రం ప్రశ్నించవచ్చు. దాంతో..ఇద్దరు ముఖ్యమంత్రుల విజ్ఙప్తులను తోసిపుచ్చే అవకాశాలే అధికంగా ఉన్నాయి. దీంతో...సృజన తప్పకుండా తెలంగాణకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో హిమన్ష్ శుక్లాకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా అవకాశం రావచ్చు. ఆయన కూడా ఇక్కడ పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారు. రాష్ట్రంలో ఎన్‌డిఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనను రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్‌గా నియమించారు. అయితే..ఆయన అక్కడ అంత ఆసక్తిగా పనిచేయడం లేదనే మాట వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సమాచారశాఖలో భారీగా అవినీతి జరగడం దానిపై ప్రభుత్వం విజిలెన్స్, ఏసీబీ విచారణ చేయిస్తుండడం శుక్లాకు ఇబ్బందిగా తయారైంది. ప్రతిరోజూ సమాచారశాఖకు విజిలెన్స్, ఏసీబీ అధికారులు వచ్చి దస్త్రాలను పట్టుకువెళ్లడం, దానిపై విచారణ జరగడం, వివిధ మార్గాల నుండి ఆయనపై ఒత్తిడిలు రావడంతో..ఆయన ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో జరిగిన తప్పుడు పనులు ఇప్పుడు శాఖను వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ నుంచి తప్పుకుని కలెక్టర్‌గా వెళితే..బాగుంటుందనే ఆలోచన ఆయనలో ఉంది. ఒక వేళ ప్రభుత్వ పెద్దలు ఆయనను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా నియమిస్తే ఆయన సంతోషంగా ఇక్కడ నుంచి వెళ్లిపోతారు. మొత్తం మీద...సృజన సంగతి తేలితే..శుక్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కావడం లాంఛనమే.