విజయ్‌కుమార్‌రెడ్డి విధేయులకు మళ్లీ పోస్టింగ్‌లు...!?
రాష్ట్ర సమాచారశాఖ మాజీ కమీషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి అవినీతి, అక్రమాలపై ఇంకా ఏమీ తేల్చకుండానే కూటమి ప్రభుత్వం ఆయన అవినీతిలో భాగస్వాములైన ఉన్నతాధికారులకు మళ్లీ పోస్టింగ్‌లు ఇవ్వడానికి సిద్ధమైంది. విజయ్‌కుమార్‌రెడ్డి కమీషనర్‌గా ఉన్నప్పుడు శాఖలో భారీగా అవినీతి, అక్రమాలు, అనైతిక కార్యక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కూటమి ప్రభుత్వం ఏసీబీ, విజిలెన్స్ విజిలెన్స్ విచారణ చేయిస్తోంది. అప్పట్లో విజయ్‌కుమార్‌రెడ్డి అవినీతికి, అక్రమాలకు సహకరించిన, అందులో భాగస్వాములైన వారిని కూటమి ప్రభుత్వం జీఏడీకి అటాచ్ చేసింది. అంతే కాకుండా విజయ్‌కుమార్‌రెడ్డిని వెనక్కు రప్పిస్తామని సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారధి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. అంతే కాదు..అవినీతికి పాల్పడిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. అయితే..ఇవన్నీ ఉత్తుత్తి హామీలేనని, అవినీతికి, అరాచకాలకు పాల్పడిన ఇద్దరు అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని దస్త్రాలను కదుపుతున్నారు. నేడో రేపో వారి పోస్టింగ్‌లకు సంబంధించిన ఉత్తర్వులు రావచ్చు. జగన్ దోపిడికి అప్పట్లో సహకరించిన విజయ్‌కుమార్‌రెడ్డి చెప్పా పెట్టకుండా ఇక్కడ నుంచి జారుకుంటే..ఆయనకు సహకరించి, అవినీతిలో భాగస్వాములైన వారికి నెల తిరగకుండానే మళ్లీ పోస్టింగ్ ఇవ్వనున్నారనే వార్తలు శాఖలో కలకలం రేపుతోంది.
అరాచకశక్తి మళ్లీ వస్తోందా...!?
విజయ్‌కుమార్‌రెడ్డి కమీషనర్‌గా ఉన్నప్పుడు శాఖను తన కనుసన్నల్లో శాసించిన అధికారికి మళ్లీ అక్కడే పోస్టింగ్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. తొలుత ఆ అధికారికి ప్రెస్ అకాడమీ సెక్రటరీగా పోస్టింగ్ ఇస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే..ఆ అధికారి మంత్రి కార్యాలయంలో పైరవీ చేసి మళ్లీ తన పాతపోస్టును దక్కించుకుంటున్నారని తెలుస్తోంది. వాస్తవానికి సమాచారశాఖ మంత్రి పార్థసారధికి మంచివాడు,సౌమ్యుడు, నెమ్మదస్తుడనే పేరుంది. అయితే..ఆయన మంచితనాన్ని ఆసరాగా చేసుకుని, ఆయన కార్యాలయ అధికారి సదరు అవినీతి అధికారులకు పోస్టింగ్ లు ఇచ్చేందుకు చక్రం తిప్పారని ప్రచారం జరుగుతోంది. ఇలా పోస్టింగ్‌లు ఇచ్చేందుకు భారీగా సొమ్ములు మారినట్లు తెలుస్తోంది. గతంలో భారీస్థాయిలో అవినీతికి పాల్పడిన ఈ అధికారులు ఇప్పుడు సొమ్ములను విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్నారని, తమకు పోస్టింగ్ ఇప్పిస్తే..ఎంతైనా ఇచ్చుకుంటామని చెబుతున్నారట. ఈ నేపథ్యంలో మంత్రి కార్యాలయ అధికారికి భారీగా ముట్టచెప్పారని, మంత్రి ఆదేశంలో డైరెక్టర్ వీరి పోస్టింగ్‌ల కోసం దస్త్రాన్ని కదిపారని, అది ఆయన వద్ద నుంచి జిఏడీ కార్యదర్శికి చేరిందని తెలుస్తోంది. అయితే జిఎడి కార్యదర్శి సదరు అధికారులపై భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు ఉన్నందున్న ప్రెస్ అకాడమిలో పోస్టింగ్ ఇస్తామని చెప్పారని, అయితే..అందుకు సదరు అధికారి నిరాకరించి గతంలో..తాను ఏ పోస్టులో ఉన్నానో అదే పోస్ట్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సదరు అధికారికి సిఎంఓ అధికారి కూడా సహకరించారని, గతంలో ఆయన హైదరాబాద్‌లో పనిచేసినప్పుడు ఈ అధికారి అతని వద్ద పనిచేశారని, దాంతో..ఆయన ఆ అధికారి కోరిన పోస్టు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని, నేడో రేపో దీనిపై ఉత్తర్వులు వెలువడుతాయని మీడియా, అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సొమ్ములకు అమ్ముడుపోయారా..? లేక కుల గజ్జా...?
జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడిన సదరు అధికారిని మళ్లీ అక్కడే నియమిస్తే..ఇంకేమైనా ఉందా..? వారి అవినీతిపై కథలు..కథలుగా చెప్పుకుంటున్న విషయాలు వీరికి తెలియవా..? సాక్షాత్తూ మంత్రే అసెంబ్లీలో అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, ఇప్పుడు మళ్లీ వారికి పోస్టింగ్‌లు ఇవ్వడం ఏమిటి..? అసలు ఎటుపోతోంది...సమాచారశాఖ. సమాచారశాఖ తీరుపై ఇప్పుడు సచివాలయంలో తీవ్ర చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనిపై చూసీ చూడనట్లు వదిలేయడం ఏమిటి..? ఒకవైపు ఏబీసీ, విజిలెన్స్ విచారణ సాగుతున్న పరిస్థితుల్లో ఇంత అత్యవసరంగా వారికి పోస్టింగ్‌లు ఎందుకు ఇవ్వాలి..? ఎవరి ఒత్తిడి వీరిపై ఉంది..? లేక ఎంత సొమ్ము చేతులు మారింది..? మంత్రి కార్యాలయంలో పనిచేసే కీలక అధికారే దీనికి కారణమనే ప్రచారం సాగుతోంది. మంత్రి మంచితనాన్ని అడ్డుపెట్టుకుని, ఈ అధికారి సొమ్ముల కోసం ఆశపడి వారికి పోస్టింగ్‌లు ఇవ్వడానికి తన వంతు కృషి చేస్తున్నారని, మరో వైపు తన సామాజికవర్గానికి చెందిన వారనే భావన ఉందని, అదీకాకుండా వీరంతా వైకాపా సానుభూతిపరులు కావడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. ఒక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతి అధికారులను వదిలిపెట్టను..వారిని శిక్షిస్తామని చెబుతుంటే..మరోవైపు మాత్రం అదే వైకాపా విధేయులకు, యధేచ్ఛగా పోస్టింగ్‌లు ఇస్తూపోతున్నారు. దీని ద్వారా సమాన్య ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నారే పాలకులే తెలియాలి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సదరు అధికారులు చంద్రబాబును, ఆయన కుమారుడిని వ్యక్తిగతంగా దుర్భాషలు ఆడారు. అయినా..వారిపై ఇంత ప్రేమ ఏమిటో..పక్కా వైకాపా భక్తులను మళ్లీ ఆహ్వానించి పెద్దపీట వేయడంపై టిడిపి కార్యకర్తల్లో, నాయకుల్లో, సానుభూతిపరుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.