టిడిపి కార్యకర్తలను బెదిరించటానికి తప్పుడు కేసులా ?
ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు టిడిపి ఎమ్మెల్యే అఖిల ప్రియ మరియు టిడిపి కార్యకర్తలపై బురద చల్లే తీరు మారలేదని ఇంకా టిడిపి కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం సబబు కాదని మాజీ జెడ్.పి.టీ.సీ సభ్యుడు చాంద్ భాష అన్నారు అన్నారు. బీరువాల భాష అనే వ్యక్తి జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పుకుంటూ ముస్లింలను అడ్డుపెట్టుకొని తన వ్యక్తిగత కక్షలు దృష్టిలో పెట్టుకొని తాను చేసే అరాచకాలకు కబ్జాలకు అడ్డు తగిలాడని వైసిపి ప్రభుత్వంలో పెట్టిన కేసులే కాకుండా టిడిపి ప్రభుత్వం వచ్చినా కూడా తప్పుడు మాపై కేసులు పెట్టడం సరికాదని చాంద్ భాషా అన్నారు. వ్యక్తిగతంగా నీకేదైనా సమస్యలు ఉంటే మా ఎమ్మెల్యే అఖిలమ్మ వద్దకు వచ్చి నీసమస్యను పరిష్కరించుకో అంతేకానీ మా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం నీకు సరైన పద్ధతి కాదని చాంద్ భాషా బీరువాల భాషను హెచ్చరించారు.
ఆళ్లగడ్డ పట్టణంలోని పొలం కాచింతల క్షేత్రం దగ్గర స్థలం ఆక్రమించాడని వీటిని అడ్డుకున్నందుకు కక్ష సాధించటం కోసం నాపై తప్పుడు కేసులు పెట్టడం సరికాదని హర్షవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అంతేకాకుండా చింతకుంట నుండి కాచింతలకు వెళ్లే రహదారిలో కబ్జాకు పాల్పడితే బీరువాల భాషను చింతకుంట వాసులు దేహశుద్ధి చేశారని ఆయన గుర్తు చేశారు. గత 19 సంవత్సరముల క్రితం అన్నెం నారపు రెడ్డి అనే వ్యక్తి దగ్గర కోళ్లకు హలాల్ చేస్తూ రోజువారి కూలితో జీవనం సాగించే ఏఎన్ఆర్ భాష చికెన్ షాపు పెట్టి వినియోగదారులను తూకాల్లో మోసం చేస్తూ రోజువారి వార్తాపత్రికల్లో వస్తున్న ఖరీదు కంటే ఎక్కువ రేటుకు అమ్మటం మిగిలిన అన్ని చికెన్ సెంటర్లను సిండికేట్ చేస్తూ మార్కెట్ ధర కంటే సుమారు 40 నుండి 80 రూపాయలు ఒక కిలో మీద వసూలు చేసి చనిపోయిన కోళ్లకు డ్రెస్సింగ్ చేసి చికెన్ రూపంలో అమ్ముతూ అడ్డొచ్చిన అధికారులను మామూళ్లతో మచ్చిక చేయటమే కాకుండా గత ఐదేళ్ల వైసిపి ప్రభుత్వం లో ఎవరైనా కొత్తగా చికెన్ షాప్ పెడితే వారిపై బెదిరింపులకు పాల్పడుతూ ఇప్పుడు సుమారు 300 కోట్ల నుండి 400 కోట్ల రూపాయలకు పైగా అక్రమంగా సంపాదించడమే కాకుండా 25 కు పైగా కాంప్లెక్స్ లు 25 ఎకరాలకు పైగా భూమి రాజకీయ నాయకుల అండదండలతో అడ్డు అదుపు లేకుండా సంపాదించిన ఏఎన్ఆర్ భాషకు అడ్డు తగులుతున్నానని, ఏఎన్ఆర్ భాష, బీరువాల భాష అను వీరు ఏకమై నాపై ఎస్పీ మరియు కలెక్టర్లకు ఫిర్యాదులు చేసి తప్పుడు కేసులతో బెదిరిస్తున్నారని హర్షవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. మీ చికెన్ సెంటర్లను అధికారులు ట్రెడ్ లైసెన్స్ లేదని మున్సిపాలిటీ అధికారులు బంద్ చేశారు. ఈ విషయంపై నేను బెదిరించానని నా మీద కేసు పెట్టడం ఏమిటి అని మీడియా ద్వారా ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ హుస్సేన్ భాష ముబారక్ చికెన్ సెంటర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.