కెనడా టొరంటో డుర్హం తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబరాలు
కెనడా టొరంటో డుర్హం తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. డుర్హం తెలుగు క్లబ్ వారు నిర్వహించిన గ్రాండ్ దీపావళి వేడుకలకు 800 తెలుగు కుటుంబాలు విచ్చేసి అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలతో, ఆటపాటలతో చిన్నారులు అలరించారు. నగరంలో ప్రసిద్ధి గాంచిన "గెట్ హోమ్ రియాల్టీ " అధినేతలు ఆనంద్ పేరిచర్ల,రమేష్ గోల్ల్లు మరియు రఘు జూలూరి ఈ కార్యక్రమానికి చేయూత అందించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా విత్బ్య్ నగర ఎంపీపీ లాన్ కాయ్ , డిప్యూటీ మేయర్ మలీహా షాహిద్ విచ్చేసారు. ఇంత కన్నుల పండుగ వేడుకలు నిర్వహిస్తున్న డీటీసీ కార్యవర్గ సభ్యులను ,వాలంటీర్ లను వారు అభినందించారు. ఈ కార్యక్రమం లో ఎంటర్ ప్రూనేర్ అఫ్ ది ఇయర్ గా అవంత్ సోలుషన్స్ అధినేత శ్రీనివాస్ వర్మ అట్లూరి ఎంపిక అయ్యారు. వారికి ఎంపీపీ లానే కాయ్ అవార్డును అందచేసి సత్కరించారు. ఏకో ఫ్రెండ్లీ రోల్ మోడల్ గా సాయి మోహన శర్మ ఎంపిక అయ్యారు. వారికి డీటీసీ కార్య వర్గ సభ్యులు సత్కారాలను అందచేశారు.
ప్రముఖ కూచిపూడి నృత్య విద్యాలయ అధినేత సుధా వేమూరి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నృత్యాలు అతిధులని అలరించాయి. ఈ దీపావళి వేడుకలో ప్రత్యేక అతిధులుగా డుర్హం హైద్రాబాదీ అసోసియేషన్ సభ్యులు విచ్చేసి వారి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియ చేసారు. ఈ కార్యక్రమానికి డుర్హం తెలుగు క్లబ్ ప్రెసిడెంట్ నర్సింహా రెడ్డి, గుత్తిరెడ్డి మరియు డైరెక్టర్స్ రవి మేకల, వెంకట్ చిలువేరు, శ్రీకాంత్ సింగిసేతి, రమేష్ ఉప్పలపాటి, గుణ శేఖర్ రెడ్డి, గౌతమ్ పిడపర్తి, సర్దార్ ఖాన్,వాసు ,కమల మూర్తి, యుగి చెరుకూరి మరియు శివ హాజరు అయ్యారు. డుర్హం తెలుగు కెనడా క్లబ్ ప్రెసిడెంట్ నర్సింహా రెడ్డి గారు దీపావళి సంస్కృతిని చక్కగా వివరించి ఈ వేడుకలను విజయవంతం చేసిన తెలుగు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
వెంకట్ చిలువేరు మాట్లాడుతూ దీపావళి వేడుకలు ఖండాంతరాలు దాటి మన తెలుగు సంస్కృతిని ఇనుమడింప చేసిన ప్రతి తెలుగు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. 800 మందికి పైగా తెలుగు కుటుంబాలు ఒక చోట కలుసుకొని పండగ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వారు అన్నారు. చివరగా డుర్హం తెలుగుకెనడా క్లబ్ స్పాన్సర్లకు ముఖ్యంగా ఈ కార్యక్రమం స్పాన్సర్లకు మరియు వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ, షడ్రసోపేతమైన వంటకాలతో అథితులందరూ విందు ఆరగించి కార్యక్రమాన్ని సంతోషంగా ముగించారు. ఈ సందర్భంగా DTC EC టీమ్ ఫుడ్ డ్రైవ్ చేసి ఫుడ్ ఐటమ్స్ ని సాల్వేషన్ ఆర్మీ కమ్యూనిటీ సర్వీస్ టీమ్ కి అందచేసారు.