చేకున్నోళ్లకు చేసుకున్నంత...!?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ‘కె.చంద్రశేఖర్‌రావు’ ముద్దుల తనయ ‘కవిత’ను ఈడీ అధికారులు అరెస్టు చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది.ఈరోజు ఈడీ అధికారులు ‘ఢల్లీి’ నుంచి ‘హైదరాబాద్’కు వచ్చి ఆమెను అరెస్టు చేసి, ‘ఢల్లీి’కి తరలించారు. ‘ఢల్లీి’ మద్యం కుంభకోణం కేసులో ఆమెను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. వాస్తవానికి ఈ కేసులో ఆమెను కొన్నాళ్ల క్రితం ‘ఢల్లీి’లో ఈడీ అధికారులు సుధీర్ఘంగా ప్రశ్నించి వదిలేశారు. అప్పట్లోనే..ఆమెను ఈ కేసులో అరెస్టు చేస్తారనే వార్తలు వచ్చినా..అప్పట్లో రాజకీయకారణాలతో ఆమెను అరెస్టు చేయలేదు. తనను అరెస్టు చేయవద్దంటూ ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే..అక్కడ ఆమెకు ఊరట లభించలేదు. అయితే..ఇప్పుడు ఉన్నట్లు ఉండి హఠాత్తుగా ఆమెను సార్వత్రిక ఎన్నికల ముందు అరెస్టు చేయడం రాజకీయవర్గాల్లో సంచలనానికి కారణమైంది. ‘ఢల్లీి’ మద్యం కుంభకోణం కేసులో ‘కవిత’ హస్తం ఉందని, ఆమె మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలను ఈడీ చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ‘ఢల్లీి’ మాజీ ఉపముఖ్యమంత్రి ‘మనీష్ సిసోడియా’ అరెస్టు అయ్యారు. ఆయనతోపాటు రాజ్యసభ సభ్యుడు ‘విజయసాయిరెడ్డి’ అల్లుడి సోదరుడు, ఒంగోలు ఎంపి ‘మాగుంట శ్రీనివాసులరెడ్డి’ తనయుడు ‘మాగుంట రాఘవరెడ్డి’ ‘ఆంధ్రప్రభ’ ఎండి తో పాటు పలువురు అరెస్టు అయ్యారు. అయితే వీరిలో కొంత మందికి బెయిల్‌పై బయటకు వచ్చారు. ‘ఢల్లీి’ మాజీ ఉపముఖ్యమంత్రి ‘మనీష్ సిసోడియా’ మాత్రం దాదాపుగా ఏడాదిన్నరగా జైలులోనే ఉంటున్నారు. ఆయనకు ఇంత వరకూ బెయిల్ రాలేదు. కాగా..ఇదే కేసులో ఇప్పుడు ‘ఢల్లీి’ ముఖ్యమంత్రి ‘కేజ్రీవాల్’ను కూడా అరెస్టు చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. రేపు ‘కవిత’ విచారించిన తరువాత ఆయనను అరెస్టు చేస్తారని తెలుస్తోంది. కాగా ఈ కేసులో ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె అరెస్టు కావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఒక మహిళ అయి ఉండి మద్యం కేసులో అరెస్టు కావడంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ‘కెసిఆర్’ కుటుంబంపై నిరసన వ్యక్తం అవుతోంది. అయితే..ఇదంతా రాజకీయ కుట్రతోనే చేస్తున్నారని ‘బిఆర్‌ఎస్’ ఆరోపించినా..‘కవిత’ వ్యవహారశైలివల్లే ఇది జరిగిందనే ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది.
తెలంగాణ ఉద్యమం మొదలైన తరువాత ‘కెసిఆర్’ ఉద్యమ నాయకుడిగా ఆవిర్భవించిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి అరంగ్రేటం చేశారు. ప్రత్యేక తెలంగాణానే తన ధ్యేయమని, తన కొడుకు, కుమార్తెలు అమెరికాలో ఉన్నారని, తాను,ముసల్ది మాత్రమే ఉన్నామని, ప్రత్యేక తెలంగాణ తప్ప మరో ఆకాంక్ష లేదని నాడు ‘కెసిఆర్’ తెలంగాణ ప్రజలను నమ్మబలికాడు. అయితే..‘కెసిఆర్’ తిరుగులేని ఉద్యమనేతగా ఆవిర్భవించిన తరువాత ఆయన కుమారుడు ‘కెటిఆర్’, కుమార్తె ‘కవిత’లు తెలంగాణ ఉద్యమంలోకి చొరబడ్డారు. ముఖ్యంగా ‘కవిత’ అయితే..ఉద్యమాన్ని అడ్డుబెట్టుకుని వ్యాపారులను బెదిరించి భారీగా సొమ్ములు వసూళ్లు చేశారనే ప్రచారం ఉంది. ‘బతుకమ్మ’ ఆటలపేరుతో ఆమె అరాచకాలకు తెరతీసిందని, ఆంధ్రావ్యాపారులను ఇష్టారీతిన బెదిరించి సొమ్ములు లాగారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే..అప్పట్లో తెలంగాణ సెంటిమెంట్ కారణంగా ఎవరూ ముందుకు వచ్చి ఫిర్యాదు చేయలేదు. తెలంగాణ ఆవిర్భావం కాగా..ఆమె తండ్రి ‘కెసిఆర్’ ముఖ్యమంత్రి కావడంతో ఆమెకు పట్టపగ్గాలు లేకుండాపోయాయి. దాదాపు తొమ్మిదేళ్లపాటు ఆమె ఆడిరది..ఆట అన్నట్లుగా వ్యవహారం నడిచిందని, అయితే..మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్రంలోని ‘బిజెపి’ పెద్దలతో లొల్లి పెట్టుకున్న ‘కెసిఆర్’కు తొలిసారిగా ‘కవిత’ వ్యవహారంతోనే తలబొప్పికట్టింది. మద్యం కుంభకోణాన్ని వెలికితీసిన ‘బిజెపి’ దీనిలో ఆమె పాత్ర ఉందని తేలిన తరువాత..‘కెసిఆర్’తో ఆడుకోవడం మొదలుపెట్టారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తరువాత నుంచి నిన్నమొన్నటి వరకూ..తన ప్రత్యర్థులు, రాజకీయ వ్యతిరేకులను ఇష్టారీతిన వేధించిన ‘కెసిఆర్’ కుటుంబానికి ‘కవిత’ వ్యవహారం, కాళేశ్వరం, మేడిగట్ట ప్రాజెక్టులతో అడ్డుకట్ట పడిరది. విపరీతమైన అహంభావంతో ప్రత్యర్థులను వేధించి, అపహాస్యం చేసిన ‘కెసిఆర్’ కుటుంబం ఇప్పుడు దానికి మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అధికారం ఉందనే అహంకారంతో విర్రవీగిన ‘కెసిఆర్’ కుటుంబసభ్యులను ఇప్పుడు సోషల్‌మీడియా ఒక ఆటఆడుకుంటోంది. కాలం అందరి సరదాలను తీరుస్తుందని, ఇప్పుడావంతు ‘కెసిఆర్’ కుటుంబానిది. ఇటీవల ‘చంద్రబాబు’ను అక్రమంగా ‘జగన్’ అరెస్టు చేసినప్పుడు..తనకెంతో నవ్వు వస్తోందని ‘కెటిఆర్’ చేసిన ట్విట్‌ను ఇప్పుడు పలువురు రీట్వీట్ చేస్తూ గతాన్ని గుర్తు చేస్తున్నారు.