లేటెస్ట్

‘VFIS’ నందు నూతన ఆర్థిక సంవత్సర సంబరాలు

వాలంటరీ ఫైనాన్షియల్‌ ఇన్షర్మేషన్‌ సర్వీసెస్‌ నందు నూతన ఆర్థిక సంవత్సర ప్రారంభ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ‘VFIS’ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ‘ఎస్‌బీఐ మ్యూచివల్‌ ఫండ్‌’ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఎ.రాజు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బి.నాగరాజు ఎస్‌బీఐఎఫ్‌ఐఎసిఎస్‌పి, సాంబమూర్తి, సీనియర్‌ జర్నలిస్టు డి.హనుమంతరావు, సంస్థ ఫౌండర్‌ జి.లవకుమార్‌లు అతిథిలుగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ‘లవకుమార్‌’ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో రానున్న నూతన ప్రొడక్ట్స్‌ గురించిన విలువైన సమాచారాన్ని ప్రజలకు అంద‌చేశామ‌ని చెప్పారు. ప్రజలకు ఆర్థిక అవగాహన కల్పించడంతో పాటు, ఆర్థికంగా నష్టపోకుండా, నష్టభయాలు లేకుండా, ఆర్థిక స్వాతంత్య్రం సాధించేందుకు అవసరమైన సలహాలు, మద్దతును తమ సంస్థ అందచేస్తుందని ఆయన చెప్పారు. తమ సంస్థ నుండి పేద ప్రజలకు అవసరమైన ఆర్థిక సేవలను అందిస్తామని, సామాన్యులకు ఆర్థిక సమాచారం అందిస్తామని, సామాన్య ప్రజలకు ఆర్థిక స్వాతంత్య్రం తెచ్చేందుకు కృషిచేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ పొదుపు చేసుకుంటూ, మదపు చేసుకోవాలని, దాని కోసం చిన్న చిన్న పథకాలను వారి వద్దకు తెస్తామని, నెలకు కనీసం రూ.500/- అయినా వారితో ధీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టించడానికి తాము సహాయం చేస్తామని, చిన్నచిన్న పెట్టుబడులు ధీర్ఘకాలికంగా కొనసాగిస్తే వారికి కావాల్సిన ఆర్థిక స్వాతంత్య్రం సిద్ధిస్తుందని, తమ సంస్థ దీని కోసం కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు. సంస్థ ఇప్పటికే వివిధ రకాలైన ఆర్థిక సేవలను ప్రజలకు అందిస్తుందని, రాబోయే రోజుల్లో దీన్ని మరింత విస్తృతం చేస్తామని ‘లవకుమార్‌’ వివరించారు. ఈ కార్యక్రమంలో పెట్టుబడిదారులు, సామాన్య ప్రజలూ, ఇతరులూ భారీ స్థాయిలో పాల్గొన్నారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ