లేటెస్ట్

‘పవన్‌’ను ఓడించేందుకు వైకాపా కుయుక్తులు...!

‘జనసేన’ అధ్యక్షుడు ‘పవన్‌కళ్యాణ్‌’ను వచ్చే ఎన్నికల్లో ఓడిరచేందుకు వైకాపా పెద్దలు తెరవెనుక భారీ కుయుక్తులకు పాల్పడుతున్నారు. ‘పవన్‌’ ఓడిరచేందుకు ఎలాంటి అవకాశం వచ్చినా వదులుకోకుండా వారు తమ ప్రయత్నాలను ముమ్మరంగా చేస్తున్నారు. ‘పవన్‌’ను తాను అసెంబ్లీలో చూడాలని అనుకోవడం లేదని, ఎవరు గెలిచినా ఫర్వాలేదు..పవన్‌, లోకేష్‌లు అసెంబ్లీ గేటు కూడా తాకకూడదని వైకాపా అధ్యక్షుడు ‘జగన్‌’ తన సన్నిహితులకు చెప్పారని ప్రచారం జరుగుతోంది. ‘లోకేష్‌’ విషయంలో ఇప్పటికే చేయాల్సిన పనులన్నీ చేశారని, ఇక ‘పవన్‌’ ఎక్కడ పోటీ చేస్తారనే స్పష్టత వస్తే అక్కడ కూడా కుతంత్రాలకు, కుట్రలకు పాల్పడడానికి అన్ని యత్నాలను చేసుకుంటున్నారు. ‘పవన్‌’ కాకినాడ జిల్లా ‘పీఠాపురం’ నుంచిపోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. దాంతో అక్కడ జెసి, ఇఆర్‌ఓ, ఆర్‌ఓలను తనకు అనుకూలమైన వారిని ‘జగన్‌’ నియమించుకున్నారు. తన వాళ్లు అన్న అధికారులు అక్కడ ఉంటే..ఏదో రకంగా ‘పవన్‌’ను గెలవనీయకుండా చూడవచ్చుననే ఆలోచన వైకాపా పెద్దల్లో ఉందని, దానికి అనుగుణంగా వ్యూహాలను వారు రచించుకుంటున్నారని ‘కాకినాడ’ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ‘పవన్‌’ ‘పీఠాపురం’లో పోటీ చేస్తే ఆయన గెలుపు సునాయాసమే. ‘పవన్‌’ సామాజికవర్గ ఓటర్లు ఇక్కడ మెజార్టీ సంఖ్యలో ఉన్నారు. దాదాపు 70వేల మంది ‘కాపు’ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఇక్కడ ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ వైకాపా నుంచి ‘పెండెం దొరబాబు’ గెలుపొందారు. టిడిపి నుంచి ‘ఎన్‌విఎన్‌ వర్మ’ రెండోస్థానంలో నిలవగా, జనసేన తరుపున పోటీ చేసిన ‘శేషుకుమారి’ మూడవ స్థానంలో నిలిచారు. బలమైన కాపు సామాజికవర్గం ఉన్న ఈ నియోజకవర్గంలో రాజకీయచైతన్యం ఎక్కువే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత ఆ పార్టీ కేవలం మూడుసార్లు మాత్రమే ఇక్కడ విజయం సాధించింది. కాంగ్రెస్‌ పరిస్థితి కూడా దాదాపు అంతే. అయితే ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు మాత్రం ‘కాపు’ సామాజికవర్గం మొత్తం ఆ పార్టీ అభ్యర్థి వెనుక నిలబడిరది. ఆ ఎన్నికల్లో ‘వంగాగీత’ వెయ్యి ఓట్ల స్పల్ప తేడాతో గెలుపొందారు. గట్టిపోటీ ఉంటే..ఇక్కడ ‘పవన్‌’ గెలవడం అంత సునాయాసం కాదని, ‘కాపు’ సామాజికవర్గం మొత్తం ఆయన వెంట నిలిచినా..మిగతా సామాజికవర్గాల్లో చీలిక తెచ్చి ఆయనను ఓడిరచడం ఒక మార్గం కాగా..అధికారుల సహాయంతో అక్రమాలకు పాల్పడి..‘పవన్‌’ను ఓడిరచాలనే భావన వైకాపా పెద్దల్లో ఉంది. వైకాపా పాల్పడుతోన్న కుట్రలను ముందుగానే గ్రహించిన ‘జనసేన`టిడిపి కూటమి అందుకు విరుగుడు మంత్రాన్ని వేస్తోంది. మొత్తం మీద..‘పవన్‌’ తన మాట వినలేదని, అందుకు ఆయనకు పాఠం నేర్పాలనే తపనతో ఉన్న ‘జగన్‌’ ఎత్తులు పారుతాయా..? లేదో చూడాల్సి ఉంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ