కృష్ణాలో టిడిపి ప్రభంజనం...!
16లో 12 టిడిపికి 2 వైకాపాకు...!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ప్రముఖ సర్వే సంస్థ ఆజ్‌తక్ పేర్కొంది. ప్రతిపక్ష టిడిపి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో స్వీప్ చేయబోతోందని ఆ సంస్థ చెబుతోంది. కాగా రాజకీయచైతన్యం ఎక్కువ ఉన్న కృష్ణా జిల్లాలో ఈసారి అధికారపక్షం తుడిచిపెట్టుకుపోతుందని ఓ సర్వేలో తేలింది. మొత్తం 16 సీట్లు ఉన్న కృష్ణా జిల్లాలో రెండు సీట్లు తప్ప మిగతా అన్ని సీట్లలో టిడిపినే గెలుస్తుందని ఈ సర్వే చెప్పింది. గత ఎన్నికల్లో టిడిపికి కేవలం రెండు సీట్లు మాత్రమే రాగా...అధికార వైకాపాకు 14సీట్లు వచ్చాయి. ఈసారి ఆ ఫలితాలు తారుమారు అవుతాయని తెలుస్తోంది. అభ్యర్థులు ఎవరో ఇంకా అధికారికంగా నిర్ణయించకపోయినా..ఏ పార్టీలకు ఓట్లు వేస్తారనే దానిపై ఈ సర్వేను నిర్వహించారు. అధికార వైకాపా, దానికి ప్రత్యర్థిగా టిడిపి+జనసేన కూటమి పోటీ పడుతున్నాయి. ముఖాముఖి పోటీలో ఏ పార్టీ ఎంత శాతం ఓటింగ్ సాధిస్తుందో సర్వే తెలియచేసింది. ఆ సర్వే ప్రకారం మచిలీపట్నంలో టిడిపి కూటమికి 55శాతం, వైకాపాకు 39శాతం, పెడనలో టిడిపికూటమి 50శాతం, వైకాపా 40శాతం, అవనిగడ్డలో టిడిపి 52శాతం, వైకాపా 41శాతం, పెనమలూరులో టిడిపికి 55శాతం, వైకాపాకు 38శాతం, పామర్రులో టిడిపికి 47శాతం, వైకాపాకు 49శాతం, గుడివాడలో టిడిపికి 47శాతం, వైకాపాకు 48శాతం, గన్నవరంలో టిడిపికి 56శాతం, వైకాపా 39శాతం, విజయవాడ తూర్పులో టిడిపికి 54శాతం, వైకాపా 38శాతం, విజయవాడ సెంట్రల్ లో టిడిపికి 53శాతం, వైకాపాకు 37శాతం, విజయవాడ వెస్ట్టిలో డిపికి 44శాతం, వైకాపాకు 43శాతం, మైలవరంలో టిడిపికి 52శాతం, వైకాపాకు 42శాతం, నందిగామలో టిడిపికి 50శాతం, వైకాపాకు 40శాతం, జగ్గయ్యపేటలో టిడిపికి 53శాతం, వైకాపాకు 42శాతం, తిరువూరులో టిడిపికి 46శాతం, వైకాపాకు 46శాతం, నూజివీడులో టిడిపికి 48శాతం, వైకాపాకు 45శాతం, కైకలూరులో టిడిపికి 54శాతం, వైకాపాకు 41శాతం ఓట్లు వస్తాయని సర్వే సంస్థ తేల్చింది. దీని ప్రకారం చూసుకుంటే మొత్తం 16 స్థానాల్లో పామర్రు, గుడివాడ తప్ప మిగతా అన్ని చోట్ల టిడిపినే గెలిచే అవకాశం ఉంది. టిడిపి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న గుడివాడలో టిడిపి, వైకాపా మధ్య వ్యత్యాసం కేవలం 1శాతం మాత్రమే. అదే విధంగా తిరువూరులో టిడిపి, వైకాపా పోటాపోటీగా ఉన్నాయి.